BREAKING
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి.. డీఎస్పీ రవిబాబు.. ఘనంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. 8వ వార్డులో జనసేన అభ్యర్థి ఎస్. మురధు విస్తృత ప్రచారం అనుమతులు జీ ప్లస్‌ 2.. నిర్మాణాలు జీ ప్లస్‌ 3,లేదా జీ ప్లస్ 4. ఐరోపా మార్కెట్లపై కేంద్ర బ్యాంకుల ప్రభావం...ఈసీబీ భవిష్యత్తు మరియు ఆర్థిక సవాళ్లు చలో ఢిల్లీకి రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ దండు..జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్ స్పానిష్ దిగ్గజం కైక్సాబ్యాంక్ మూడో త్రైమాసిక నికర లాభంలో 22 శాతం వృద్ధి బ్రిటన్ ఇంధన రంగంలో కొత్త ఒప్పందాల జోరు ప్రజా ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి.. రాళ్లగంగమ్మ ఆలయంలో పూజలతో ప్రచారానికి శ్రీకారం క్రిప్టో చరిత్రలో అతిపెద్ద భద్రతా వైఫల్యం...బినాన్స్ డేటా ఉల్లంఘన ప్రకంపనలు కొత్తపెళ్లి గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి 75 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమ ఇసుక, నాలుగు డంపర్లు స్వాధీనం విమాన ఛార్జీల పెంపు, వ్యయ నియంత్రణ...స్టాక్ మార్కెట్లో ఎగబాకిన ఇండిగో షేర్లు భారత్ ట్రెండ్స్ షేర్లలో భారీ లాభాలు నమోదు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం రష్యాపై వాగ్ధాటి తగ్గించాలని యూరప్ దేశాలకు పెంటగాన్ విజ్ఞప్తి

'గేమ్ ఛేంజర్' ఒరిజినల్ కథపై కార్తీక్ సుబ్బరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Select Suryaa Now
'గేమ్ ఛేంజర్' ఒరిజినల్ కథపై కార్తీక్ సుబ్బరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'గేమ్ ఛేంజర్' చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మూలకథను అందించిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తాను శంకర్‌కు అందించిన అసలు కథ ఏంటో, అది తెరపైకి వచ్చేసరికి ఎలా మారిందో వెల్లడించారు.

కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. తాను రాసుకున్న కథ వ్యవస్థను మార్చే ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుందని చెప్పారు. హిందీ చిత్రం 'న్యూటన్' తరహాలో చాలా వాస్తవికంగా, గ్యాంగ్‌స్టర్ నేపధ్యంతో కూడిన యాక్షన్‌తో ఈ లైన్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. తమిళ నేటివిటీకి తగ్గట్లుగా మదురై గ్యాంగ్‌స్టర్ అంశాలను, కథానాయకుడి స్నేహితుడి కీలక పాత్రను ఇందులో జోడించి రాసుకున్నానని వెల్లడించారు.

అయితే ఆ సమయంలో తాను 'మహాన్' సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో కేవలం కథ మాత్రమే ఇచ్చి, స్క్రీన్‌ప్లే రాయలేకపోయానని ఆయన వివరించారు. రామ్ చరణ్ లాంటి భారీ స్టార్, శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడు కాంబినేషన్‌లో వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేసరికి కథ స్వరూపం పూర్తిగా మారిపోయిందని అభిప్రాయపడ్డారు. కథలో మార్పులు వచ్చినప్పటికీ, శంకర్ లాంటి దర్శకుడు తన కథను ఎంచుకోవడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.