కొండామర్రిపల్లిలో అట్టహాసంగా పీటర్ రాక్ చర్చి ప్రారంభం : ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా
మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా,మదనపల్లె మండలం కొండామర్రిపల్లిలో నూతనంగా నిర్మించిన పీటర్ రాక్ చర్చిని మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా ప్రారంభించారు.బుధవారం పాస్టర్ జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ప్రార్థనా మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకి జాన్ బాబు ఆధ్వర్యంలో క్రైస్తవ మత పెద్దలు,పాస్టర్లు,సంఘ సభ్యులతోఘనంగా స్వాగతం పలికి దుశ్యాలువ,పూలమాలతో సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రార్థనా మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్న క్రైస్తవ మతపెద్దలు,పాస్టర్లతో ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.జాన్ బాబు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిమ్మరాయుడు,కృష్ణ యాదవ్,రమణతోపాటు పాస్టర్లు పాల వెంకటరమణ,జానకిశయంఆర్థరాజు,మణి,దేవకుమార్,సుధాకర్,దివాకర్,పాస్టర్ రవిలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి