సుందరి అనిల్ ఔదార్యం.. ఆపరేషన్ ఖర్చులకు రూ.15 వేల ఆర్థిక సాయం
కోట్ పల్లి, మేజర్ న్యూస్: ఇచ్చిన మాటకు కట్టుబడి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ కరీంపూర్ మాజీ సర్పంచ్, కొట్పల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ మానవత్వాన్ని చాటుకున్నారు. కరీంపూర్ గ్రామానికి చెందిన ఉషానోళ్ల సుభాష్ కుమారుడికి మెడిక్యూర్ ఆస్పత్రిలో కాలు ఆపరేషన్ జరగడంతో, ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎవరికి ఆపరేషన్ జరిగినా తన వంతు ఆర్థిక సహాయం అందిస్తానని గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ సాయం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సదత్ పటేల్‌తో పాటు గ్రామ పెద్దలు రషీద్, కరీం, యేసు, మోహిజ్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.