13వ వార్డులో శ్రీలక్ష్మి రాజేష్‌కు ఘన సన్మానం చైర్‌పర్సన్ అభ్యర్థికి శాలువా, పూలమాలతో ఆత్మీయ స్వాగతం తిరుమలేష్ యాదవ్ ప్రచారానికి జోరు
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్, 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తిరుమలేష్ యాదవ్ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుసుకున్నారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్‌కు స్థానికులు, పార్టీ శ్రేణులు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఆమెకు లభించిన ఆత్మీయ స్వాగతంతో ప్రచార కార్యక్రమంలో సందడి నెలకొంది.మరోవైపు 13వ వార్డులో తిరుమలేష్ యాదవ్ ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యమిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. శ్రీలక్ష్మి రాజేష్‌ను చైర్‌పర్సన్‌గా, తిరుమలేష్ యాదవ్‌ను 13వ వార్డు కౌన్సిలర్‌గా గెలిపించాలని పార్టీ శ్రేణులు ప్రజలను అభ్యర్థిస్తున్నాయి.
అనిల్ కుమార్ యాదవ్