BREAKING
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి.. డీఎస్పీ రవిబాబు.. ఘనంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. 8వ వార్డులో జనసేన అభ్యర్థి ఎస్. మురధు విస్తృత ప్రచారం అనుమతులు జీ ప్లస్‌ 2.. నిర్మాణాలు జీ ప్లస్‌ 3,లేదా జీ ప్లస్ 4. ఐరోపా మార్కెట్లపై కేంద్ర బ్యాంకుల ప్రభావం...ఈసీబీ భవిష్యత్తు మరియు ఆర్థిక సవాళ్లు చలో ఢిల్లీకి రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ దండు..జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్ స్పానిష్ దిగ్గజం కైక్సాబ్యాంక్ మూడో త్రైమాసిక నికర లాభంలో 22 శాతం వృద్ధి బ్రిటన్ ఇంధన రంగంలో కొత్త ఒప్పందాల జోరు ప్రజా ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి.. రాళ్లగంగమ్మ ఆలయంలో పూజలతో ప్రచారానికి శ్రీకారం క్రిప్టో చరిత్రలో అతిపెద్ద భద్రతా వైఫల్యం...బినాన్స్ డేటా ఉల్లంఘన ప్రకంపనలు కొత్తపెళ్లి గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి 75 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమ ఇసుక, నాలుగు డంపర్లు స్వాధీనం విమాన ఛార్జీల పెంపు, వ్యయ నియంత్రణ...స్టాక్ మార్కెట్లో ఎగబాకిన ఇండిగో షేర్లు భారత్ ట్రెండ్స్ షేర్లలో భారీ లాభాలు నమోదు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం రష్యాపై వాగ్ధాటి తగ్గించాలని యూరప్ దేశాలకు పెంటగాన్ విజ్ఞప్తి

అన్ను కపూర్ వ్యాఖ్యలపై స్పందించిన తమన్నా భాటియా

Select Suryaa Now
అన్ను కపూర్ వ్యాఖ్యలపై స్పందించిన తమన్నా భాటియా

నటుడు అన్ను కపూర్ గతంలో తమన్నా భాటియా రూపురేఖలపై చేసిన 'దూధియా బదన్' వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా, ఈ వివాదంపై మొదటిసారి స్పందించారు. అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే తన పనిపై దృష్టి పెట్టడమే తనకు ముఖ్యమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

ఆమె మాట్లాడుతూ.. "మన వినే మాటల్లో ఏవి తీసుకోవాలో, ఏవి వదిలేయాలో స్పష్టత ఉండాలి. మనం ఇలాంటి వ్యాఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పోతే జీవితంలో ముందుకు సాగలేము. అందుకే నేను ఇలాంటి విషయాలను పట్టించుకోను, కేవలం నా నటన, నా కెరీర్ మరియు నేను చేసే పనిపై మాత్రమే దృష్టి సారిస్తాను" అని తెలిపారు.

తన వృత్తిని ఒక బాధ్యతగా, సేవగా భావించి మనస్ఫూర్తిగా పని చేస్తానని, అందుకే ఆ కష్టం ప్రేక్షకులకు చేరుతుందనే నమ్మకం తనకు ఉందని తమన్నా పేర్కొన్నారు. కాగా, అన్ను కపూర్ గతంలో ఒక పాటను చూస్తూ చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు రాగా, తాను ఎలాంటి తప్పుడు ఉద్దేశంతో ఆ మాట అనలేదని ఆ తర్వాత వివరణ ఇచ్చారు.