కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి బీసీహెచ్‌పీఎస్ సంపూర్ణ మద్ధతు : బీసీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ వెల్లడి
మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లె మున్సిపాలిటీలో కూటమి టీడీపీ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ హక్కుల పోరాట సమితి (బీసీహెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ తెలిపారు.బుధవారం మదనపల్లె పట్టణం స్థానిక నీరుగుట్టువారిపల్లె మార్కెట్ యార్డు ఎదుట ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.ఈ సందర్భంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీరామ్ చినబాబుకు చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం శుభపరిణామమని,ఆయనకు మద్దతుగా నిలవాలని కోరారు.బిసి యువనేత శ్రీరామ్ చినబాబును గెలిపించుకుంటే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తారని బోడెం రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.శ్రీరామ్ చినబాబు గెలుపు కోసం బీసీలు ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందన్నారు.ఇదే స్పూర్తితో బీసీలంతా ఐకమత్యంగా ముందుకు సాగి భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీసీహెచ్‌పీఎస్ నాయకులు వై.వి.శేఖర్ నాయుడు,సి.రామలింగయ్య,కరామత్ బాషా,బాలసుబ్రహ్మణ్యం,లక్ష్మయ్య,నూర్ అహ్మద్,సుబ్బయ్య,మహేశ్వర,రామ్ మోహన్,రాజేంద్ర,మురళి,సుబ్బరాజు,నాగేంద్ర కుమార్,చంద్రయ్యలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి