చింతపట్ల గ్రామపంచాయతీ బోరు వాటర్ పంట పొలాలకు దారి మళ్లింపు
*చింతపట్ల గ్రామపంచాయతీ బోరు వాటర్ పంట పొలాలకు దారి మళ్లింపు*
గ్రామ సెక్రెటరీ పనితీరుపై అసహనం
ప్రజా ప్రతినిధులకు అండగా నిలిచిన పంచాయతీ కార్యదర్శి
ప్రజలను పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన
మూగజీవాలకు తొట్లు ఏర్పాటు చేయాలని గొర్ల కాపరులు డిమాండ్
మండల పరిధిలో చింతపట్ల గ్రామపంచాయతీ బోర్ వాటర్ ని వ్యవసాయ పంట పొలాలకు దారి మళ్ళించారు. సుమారు 4 రోజుల నుండి నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని గ్రామ వాటర్ మ్యాన్ కందుకూరి దానయ్య, సోషల్ మీడియాలో , నీటి సమస్య ఉందని, త్రాగునీరు వృధా చేయకూడదని ప్రజలకు సందేశం ఇచ్చారు. అయినా ప్రజాప్రతినిధుల వ్యవసాయ పొలాలకు గ్రామ సెక్రెటరీ రవికుమార్ రెడ్డి బోరువాటరు మళ్లించడం, గ్రామస్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలను పట్టించుకోవడం లేదని, మండల అధికారులకు చింతపట్లలో గ్రామ సమస్యలు లేవని ఇంత ముందుకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ మండల అధికారులను మభ్యపెట్టి, గ్రామ ప్రజల సమస్యలను తప్పుదోవ పట్టించడం కొంతమంది వివిధ పార్టీ నేతలు, గ్రామస్తులు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన గ్రామ సెక్రెటరీ రవికుమార్ రెడ్డి నీటి సమస్యపై దృష్టి సారించా లేకుండా, నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నించారు. ఆయన పనితీరుపై పై అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా? అనే సందేహం నెలకొంది.
కొండ్రు శివ.... యాచారం, మేజర్ న్యూస్