22వ వార్డులో గోవిందరెడ్డి ఐశ్వర్య సుడిగాలి పర్యటన
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : 22వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోవిందరెడ్డి ఐశ్వర్య ప్రచారంలో భాగంగా వార్డు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. సాయి నగర్ 1వ క్రాస్ నుంచి 7వ క్రాస్ వరకు, అలాగే సూర్య నగర్ బ్యాక్ సైడ్ మరియు ముండోల్ల కొట్టాల ప్రాంతాల్లో ఆమె చేపట్టిన సుడిగాలి పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా ప్రతి గడప తొక్కుతూ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఐశ్వర్య ప్రజలకు వివరించారు.
పర్యటనలో స్థానిక ప్రజలు ఆమెకు నీరాజనాలు పలికారు. అభ్యర్థి ఐశ్వర్యకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే తమ ఓటు వేసి అపూర్వ విజయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గోవిందరెడ్డి ఐశ్వర్య మాట్లాడుతూ, "నన్ను గెలిపిస్తే 22వ వార్డులో నిరంతరం అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాను. వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది" అని హామీ ఇచ్చారు.
అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్.