ఎంపిపి పువ్వాడి వెంకటేశ్వర్లు కు చట్టమడుగు టీడీపీ నేతలు సత్కారం
పామూరు, మేజర్ న్యూస్ :
పామూరు మండల ఎంపిపిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పువ్వాడి వెంకటేశ్వర్లును మండలంలోని చట్టమడుగు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గురువారం ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. పట్టణంలోని శేషమహల్ థియేటర్ ప్రాంగణంలో టీడీపీ సీనియర్ నాయకుడు కొంపల్లి వెంకట రాజేంద్ర, టీడీపీ యువ నాయకుడు కొంపల్లి సత్యనారాయణ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరాభిమాని కొంపల్లి వెంకటేష్‌లు పువ్వాడి వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. మండల ఎంపిపిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. పామూరు మండల అభివృద్ధికి పువ్వాడి వెంకటేశ్వర్లు తన అనుభవంతో విశేషంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు ప్రముఖ బిల్డర్ పువ్వాడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.