సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీసుధ విద్యార్థులు
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: ఇటీవల నంద్యాలలో నిర్వహించిన 70వ ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్‌జీఎఫ్ (SGF) సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీల్లో శ్రీసుధ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రతినిధులు తెలిపారు.అండర్–17 విభాగంలో జి.భారత్‌రాజ్, అండర్–14 విభాగంలో ఎం.మణి తనీష్ అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనూ రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల కరస్పాండెంట్ సాధానగిరి వేణుగోపాల్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విజేతలను, క్రీడాకారుల శిక్షణకు కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు, మనోహర్, రవికుమార్, సురేష్‌లను పాఠశాల చైర్మన్ సాధానగిరి సుదర్శన్, డైరెక్టర్లు రాజా సుధాకర్‌గుప్తా, కరణం సూర్యనారాయణ, ప్రిన్సిపల్ మేరీ చార్లెస్, వైస్ ప్రిన్సిపల్ షమీనా, తరగతి ఉపాధ్యాయులు ఆంజనేయులు, ప్రకాష్ తదితరులు అభినందించారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం