BREAKING
జనసేన గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం! గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన హనీట్రాప్ కేసులో పావన్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు పోగొట్టుకున్న మొబైల్‌ను సీఈఐఆర్ ద్వారా అందజేత**సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితురాలికి అందజేసిన సాయి కిషోర్ రెడ్డి* సాఫ్ట్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీసుధ విద్యార్థులు ఎంపిపి పువ్వాడి వెంకటేశ్వర్లు కు చట్టమడుగు టీడీపీ నేతలు సత్కారం సత్తుపల్లి లో సివంగుల సమరం - కబాడీ పోటీల్లో హోరాహోరీ రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు మోద-2 అభివృద్ధికి కృషి చేస్తా.. కె.అన్నపూర్ణ హామీ ఎల్‌ఓసీ అందజేత 16వ డివిజన్‌లో కోనమ్మ ప్రచారానికి, బండి శ్రీకాంత్.. ఇంటింటా ప్రజలతో మమేకం పాఠశాల వద్ద బోలోరో ఢీ.. స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు ప్రజాసేవే లక్ష్యం.. 38వ డివిజన్ అభివృద్ధే ధ్యేయం నువ్వు గెలుస్తావు కృష్ణమూర్తి.. మా ఆశీస్సులు నీకే 13వ డివిజన్‌లో విజయ సమర శంఖారావం

సత్తుపల్లి లో సివంగుల సమరం - కబాడీ పోటీల్లో హోరాహోరీ

Select Suryaa Now
సత్తుపల్లి లో సివంగుల సమరం - కబాడీ పోటీల్లో హోరాహోరీ

*73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు ఘనంగా శ్రీకారం*

*తొలిరోజు పలు జిల్లాల జట్లు విజయభేరి.. క్రీడాకారిణుల ప్రతిభకు సత్తుపల్లి వేదిక*

*మువ్వా విజయబాబు ఆధ్వర్యంలో పోటీల నిర్వహణ.. మహిళా క్రీడలకు ప్రోత్సాహం*

సత్తుపల్లి మేజర్ సూర్య న్యూస్:
(కిరణ్ కుమార్ ఆరిక)
మైదానంలో కూతలు, మెరుపు వేగంతో రైడింగ్‌లు, ప్రత్యర్థి జట్లను నిలువరించే ట్యాకిల్స్‌తో సత్తుపల్లిలో మహిళా కబడ్డీ సందడి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళా క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకుంటూ హోరాహోరీగా తలపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ టీ జీ ఐ డీ సి  చైర్మన్ మువ్వా విజయబాబు ఆధ్వర్యంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో సత్తుపల్లిలో నిర్వహిస్తున్న 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన పోటీల్లో పలు జిల్లాల జట్లు విజయాలు సాధించి తదుపరి దశకు ముందడుగు వేశాయి.

మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వారికి మంచి వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మహిళా కబడ్డీ జట్లు పాల్గొంటుండటంతో క్రీడా ప్రాంగణంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. క్రీడాకారిణుల పట్టుదల, వేగం, సమన్వయం, పోరాట పటిమ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

*తొలి మ్యాచ్‌ల్లో ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జట్ల విజయం*

పోటీల ప్రారంభ దశలో ఖమ్మం, పెద్దపల్లి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం జట్టు 45–5 స్కోరుతో ఘన విజయం సాధించింది. రంగారెడ్డి, ములుగు జట్ల మధ్య జరిగిన పోటీలో రంగారెడ్డి జట్టు 55–25 స్కోరుతో విజయం సాధించింది. హైదరాబాద్, మెదక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 36–8 స్కోరుతో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. వరంగల్, నాగర్‌కర్నూల్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోటీలో నాగర్‌కర్నూల్ జట్టు 39–29 స్కోరుతో విజయం సాధించింది.

*సాయంత్రం జరిగిన పోటీల్లోనూ హోరాహోరీ*

మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన తదుపరి సెషన్‌లోనూ క్రీడాకారిణులు ఉత్సాహంగా పోటీపడ్డారు. మంచిర్యాల, జనగామ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జనగామ జట్టు 29–22 స్కోరుతో గెలుపొందింది. సిద్దిపేట జట్టు ఆసిఫాబాద్‌పై 48–24 స్కోరుతో విజయం సాధించింది. నల్గొండ జట్టు నారాయణపేటపై 43–23 స్కోరుతో గెలిచింది. గద్వాల జట్టు హనుమకొండపై 47–28 స్కోరుతో విజయం సాధించింది.

కరీంనగర్ జట్టు కామారెడ్డిపై 58–21 స్కోరుతో స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందగా, సూర్యాపేట జట్టు ఆదిలాబాద్‌పై 36–3 స్కోరుతో విజయం సాధించింది. మేడ్చల్ జట్టు సంగారెడ్డిపై 46–29 స్కోరుతో గెలుపొందింది. దీంతో తొలిరోజు జరిగిన మ్యాచ్‌ల్లో పలు జిల్లాల జట్లు తమ సత్తా చాటాయి. తదుపరి మ్యాచ్‌ల్లో మరింత ఉత్కంఠభరిత పోరు సాగనుండటంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

*మహిళా క్రీడలకు ప్రోత్సాహం*

రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలను సత్తుపల్లిలో నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మహిళా క్రీడాకారిణులకు తగిన ప్రోత్సాహం లభిస్తే వారు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మరింత రాణించగలరని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పోటీలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలతో సత్తుపల్లి పట్టణానికి రాష్ట్రస్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని, మహిళా క్రీడల అభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు, ఖమ్మం జిల్లా కార్యదర్శి కటికాల క్రిస్టఫర్ బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కె. స్వాతిముత్యం, ఖమ్మం జిల్లా సంయుక్త కార్యదర్శి చి. సుధాకర్, సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.డి. రహేన కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మువ్వా విజయబాబు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అభిమానులు పాల్గొన్నారు.