హనీట్రాప్ కేసులో పావన్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి
హనీట్రాప్ కేసులో నిందితుడిగా ఉన్న పావన్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం నేడు నాంపల్లి కోర్టులో పోలీసులు పావన్‌ను హాజరుపర్చనున్నారు.ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మూడు బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు సమాచారం. అలాగే, కొత్తగూడెంలోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.2 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు.