BREAKING
రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల (GMC)లో ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని, కళాశాల ప్రిన్సిపాల్ డా. M.S. రాజు అధ్యక్షతన స్ట్రోక్ నివారణ, ముందస్తు లక్షణాల గుర్తింపు, సకాలంలో చికిత్సపై అవగాహన సదస్సు ఫోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం కూటమి అభ్యర్థుల గెలుపుకై మాచాని ప్రచారం ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి *వస్తున్న మీకోసం.. కార్యక్రమం* గృహప్రవేశ కార్యక్రమంలో టిడిపి నేతలు. జాహ్నవి రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం అక్రమ మొరం తరలింపును అడ్డుకున్నందుకు సర్పంచ్‌పై దాడి:మొమిన్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్థ్య మహిపాల్ విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్ ‘బత్తా’ ఓటీటీ రిలీజ్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సర్వం సిద్ధం! బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డిమాండ్ కాఫీ విత్ కరణ్’ షోలో అలా ప్రవర్తించి ఉండకూడాల్సింది.. అజయ్ దేవగణ్‌ను చూసి నేర్చుకుంటానన్న వరుణ్ ధావన్! మాధురీ దీక్షిత్‌తో కలిసి అడుగులేసిన శార్వరి.. 'యే ప్రేమ్ మోల్ కియా' డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్! సూర్య కథనానికి స్పందన :చింతపట్లలో బోరు మోటార్ కనెక్షన్ తొలగింపు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిజిటల్ ప్రపంచం మనుషులను ఒంటరి చేస్తోంది.. సినిమా మాత్రమే సామూహిక అనుభూతిని ఇస్తుంది: ఇంతియాజ్ అలీ

అక్షయ్ కుమార్ సరసన లీడ్ రోల్‌లో భూమి పెడ్నేకర్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబినేషన్!

Select Suryaa Now
అక్షయ్ కుమార్ సరసన లీడ్ రోల్‌లో భూమి పెడ్నేకర్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబినేషన్!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరియు టాలెంటెడ్ నటి భూమి పెడ్నేకర్ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించనున్న కొత్త చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడీగా నటించేందుకు భూమి పెడ్నేకర్ అధికారికంగా ఎంపికయ్యారు. కొద్ది రోజుల క్రితం అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్‌లో మరో కొత్త ప్రాజెక్ట్ రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడగా, తాజాగా ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయంపై స్పష్టత వచ్చేసింది. చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా భూమి సతీష్ పెడ్నేకర్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు.

ఈ టాలెంటెడ్ జోడీ గతంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. సరిగ్గా నాల్గు సంవత్సరాల క్రితం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రక్షాబంధన్ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంతో సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి. ఇటీవల కాలంలో తన విభిన్నమైన కథా పాత్రలతో నటిగా మరింత పేరు తెచ్చుకున్న భూమి పెడ్నేకర్, ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం.

దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ తనదైన శైలి కామెడీ మరియు భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కలయికలో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విచాయి. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయడానికి ఈ పవర్‌ఫుల్ కాంబో సిద్ధమవుతుండగా, తోడుగా భూమి పెడ్నేకర్ నటన సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమాతో ఈ జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.