BREAKING
ధనాపురం, హోన్నంపల్లిలో టీడీపీ ప్రచార హోరు.. రాజగోపాల్‌కు మద్దతుగా జడ్పీటీసీ వెంకటేష్..... గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి మార్టిడిలో నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల లొల్లి?... జగ్గయ్యపేట 26వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం జెడ్పీహెచ్‌ఎస్ పాములపాడులో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ అవగాహన కార్యక్రమం రైతులు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్ లక్ష్మీశ దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి తుపాను అనంతర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రజల్లోకి దూసుకుపోతున్న కుందుర్పి జడ్పిటిసి వైఎస్ఆర్సిపి చైర్మన్ కూటమి నేతలు శిఖండి రాజకీయాలు మానుకోండి.. ఎర్రకోట బ్యాలెట్ ఓటింగ్ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ. రాజమహేంద్రవరం జీఎమ్‌సీలో ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం: ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన పక్షవాత నివారణ, ముందస్తు లక్షణాల గుర్తింపుపై సమగ్ర అవగాహన సదస్సు ఫోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం కూటమి అభ్యర్థుల గెలుపుకై మాచాని ప్రచారం ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి *వస్తున్న మీకోసం.. కార్యక్రమం*

జాహ్నవి రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం

Select Suryaa Now
జాహ్నవి రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం

పామూరు, మేజర్ న్యూస్ : పామూరు మండల జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి కోరారు. ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు గురువారం బొట్లగూడూరు పంచాయతీలో జాహ్నవి రెడ్డికి మద్దతుగా ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ జాహ్నవి రెడ్డి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బొట్లగూడూరు ఎంపీటీసీ మైదుకూరు చెన్నమ్మ పెదమాల్యాద్రి, పామూరు మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు రాయవరపు శ్రీకాంత్, కోటపాటి రాజా, బొమ్మినేని శివ, గూడూరు వెంకటాద్రి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.