BREAKING
ఉయ్యూరు అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలి పలు గ్రామాల్లో కేతి బచాఓ అవగాహన కార్య క్ర మాలు ధనాపురం, హోన్నంపల్లిలో టీడీపీ ప్రచార హోరు.. రాజగోపాల్‌కు మద్దతుగా జడ్పీటీసీ అభ్యర్థి వెంకటేష్..... గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి మార్టిడిలో నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల లొల్లి?... జగ్గయ్యపేట 26వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం జెడ్పీహెచ్‌ఎస్ పాములపాడులో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ అవగాహన కార్యక్రమం రైతులు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్ లక్ష్మీశ దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి తుపాను అనంతర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రజల్లోకి దూసుకుపోతున్న కుందుర్పి జడ్పిటిసి వైఎస్ఆర్సిపి చైర్మన్ కూటమి నేతలు శిఖండి రాజకీయాలు మానుకోండి.. ఎర్రకోట బ్యాలెట్ ఓటింగ్ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ. రాజమహేంద్రవరం జీఎమ్‌సీలో ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం: ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన పక్షవాత నివారణ, ముందస్తు లక్షణాల గుర్తింపుపై సమగ్ర అవగాహన సదస్సు ఫోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం కూటమి అభ్యర్థుల గెలుపుకై మాచాని ప్రచారం

పరిశ్రమల ఏర్పాటులో పురోగతిని వేగవంతం చేయాలి* *పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
పరిశ్రమల ఏర్పాటులో పురోగతిని వేగవంతం చేయాలి*  *పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు మేజర్ న్యూస్ ప్రతినిధి:అక్టోబర్ 29:- జిల్లాలో అమలులో ఉన్న పారిశ్రామిక ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు, కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి పరిశ్రమ శాఖ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లో  పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమల వారీగా పురోగతిని సమీక్షిస్తూ, ఆయా పరిశ్రమల స్థాపనకు సంబంధించిన ప్రస్తుత స్థితిగతులను తెలుసుకుని, పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులైన పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లాలో  నియోజకవర్గాల వారీగా ప్రతిపాదించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కుల ఏర్పాటుకు సంబంధించిన ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక పార్కుల్లో రహదారులు, విద్యుత్, నీటి సరఫరా తదితర అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో పరిశ్రమల శాఖ అధికారి సంజీవ రాజు, ఏపిఐఐసి జెడ్ ఎం మధుసూదన్ రెడ్డి, నెడ్ క్యాప్ అధికారి వీరేంద్ర, తదితరులు పాల్గొన్నారు..