పోగొట్టుకున్న మొబైల్‌ను సీఈఐఆర్ ద్వారా అందజేత**సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితురాలికి అందజేసిన సాయి కిషోర్ రెడ్డి*
సూర్య అశ్వారావుపేట:పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను అత్యాధునిక సాంకేతికతతో రికవరీ చేసి బాధితురాలికి అశ్వారావుపేట పోలీసులు అందజేశారు.ఈ నెల 10వ తేదీన మారుతి కాలనీ, అశ్వారావుపేటకు చెందిన తన్నీరు పద్మ తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. దీంతో ఆమె అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన అశ్వారావుపేట పోలీసులు వెంటనే స్పందించారు. - సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ఆ మొబైల్ ఐఎంఈఐ నంబర్‌ను ట్రాక్ చేశారు. కొద్ది రోజుల్లోనే మొబైల్ ఆచూకీ కనుగొని రికవరీ చేశారు.
గురువారం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలుకు ఆ మొబైల్‌ను అధికారికంగా అప్పగించారు. తన ఫోన్ తిరిగి దొరకడంతో బాధితురాలు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.మొబైల్ పోగొట్టుకున్న వారు ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులను లేదా సీఈఐఆర్ పోర్టల్‌ను సంప్రదించాలని ఈ సందర్భంగా అశ్వారావుపేట పోలీసులు సూచించారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట