పాఠశాల వద్ద బోలోరో ఢీ.. స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు
సూర్య బెజ్జుర్:కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం లంబాడిగూడ జీపీ పరిధిలోని బో గడగూడ మేరీమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్తిడి గ్రామానికి చెందిన గోమాస్ రవీందర్ స్కూటర్‌పై పిల్లలను పాఠశాలకు తీసుకువస్తుండగా, సలుగుపల్లి వైపు నుంచి వస్తున్న బోలోరో వాహనం ఢీకొట్టడంతో ఆయన కాలికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్న రవీందర్ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం అనంతరం బోలోరో డ్రైవర్ తనదే తప్పంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడని బాధితుడు ఆరోపించాడు.