BREAKING
ఎల్‌ఓసీ అందజేత 16వ డివిజన్‌లో కోనమ్మ ప్రచారానికి, బండి శ్రీకాంత్.. ఇంటింటా ప్రజలతో మమేకం పాఠశాల వద్ద బోలోరో ఢీ.. స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు ప్రజాసేవే లక్ష్యం.. 38వ డివిజన్ అభివృద్ధే ధ్యేయం నువ్వు గెలుస్తావు కృష్ణమూర్తి.. మా ఆశీస్సులు నీకే 13వ డివిజన్‌లో విజయ సమర శంఖారావం చింతపట్ల గ్రామపంచాయతీ బోరు వాటర్ పంట పొలాలకు దారి మళ్లింపు 22వ వార్డులో గోవిందరెడ్డి ఐశ్వర్య సుడిగాలి పర్యటన 35 వ డివిజన్ లోడ్ టిడిపి నేతల ఎన్నికల ప్రచారం పశుగ్రాసం సాగుకు 100 శాతం ఉచిత రైతులకు ఖర్చుల భారం తగ్గించే అవకాశం అనంతలో 665 తుపాకుల డిపాజిట్‌ చిరుత సంచారంతో గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్న అటవి శాఖ అధికారులు. జీవిత భాగస్వామి ఎలా ఉండాలంటే సాయిపల్లవి మనసులోని మాటలు ఇవే! వివాహానికి పదివేల రూపాయల విరాళం స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఫ్లాగ్ మార్చ్ లు - ప్రజలతో పోలీసుల ముఖాముఖి - ఎన్నికల హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక

రేపటి నుండి 17వ విడత సోషల్ ఆడిట్ గ్రామసభలు - నవంబర్ 6న ప్రజావిచారణ

Select Suryaa Now
రేపటి నుండి 17వ విడత సోషల్ ఆడిట్ గ్రామసభలు  -  నవంబర్ 6న ప్రజావిచారణ

 

సూర్య - పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి మండలంలో 17వ విడత సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) ప్రక్రియలో భాగంగా ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు 30 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపిడిఓ కొప్పుల శ్రీనివాస్ వెల్లడించారు. గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులు, వాటి అమలు తీరు, ఖర్చుల వివరాలను పరిశీలించడంతోపాటు ప్రజలకు పనులపై అవగాహన కల్పించేందుకు ఈ గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న కొత్తపల్లి, హన్మంతునిపేట, కనగర్తి, గౌరెడ్డిపేట, పెద్దకల్వల, బొంపల్లి గ్రామ పంచాయతీల్లో,  31న అప్పన్నపేట, రాఘవపూర్, తుర్కల మద్దికుంట, పాలితం గ్రామాల్లో ,  నవంబర్ 2న మారెడుగొండ, బ్రాహ్మణపల్లి, కాసులపల్లి, ముత్తారం, నిట్టూరు గ్రామాల్లో 
నవంబర్ 3న పెద్దబొంకూరు, గుర్రంపల్లి, ములసాల, అందుగులపల్లి గ్రామాల్లో, నవంబర్ 4న దేవునిపల్లి, గోపయ్యపల్లి గ్రామాల్లో, నవంబర్ 5న చీకురాయి, రాంపల్లి, భోజన్నపేట, రాగినేడు, నిమ్మనపల్లి, సబ్బితం, రంగాపూర్, కాపులపల్లి, కుర్మపల్లి గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు జరగనున్నాయి.

నవంబర్ 6న ప్రజావిచారణ...

సోషల్ ఆడిట్ గ్రామసభల అనంతరం నవంబర్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రజావిచారణ నిర్వహించనున్నట్లు ఎంపిడిఓ పేర్కొన్నారు. గ్రామసభలకు సంబంధిత గ్రామాల ప్రజలు, కూలీలు, ప్రజాప్రతినిధులు హాజరై సామాజిక తనిఖీ ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు.