BREAKING
ఎల్‌ఓసీ అందజేత 16వ డివిజన్‌లో కోనమ్మ ప్రచారానికి, బండి శ్రీకాంత్.. ఇంటింటా ప్రజలతో మమేకం పాఠశాల వద్ద బోలోరో ఢీ.. స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు ప్రజాసేవే లక్ష్యం.. 38వ డివిజన్ అభివృద్ధే ధ్యేయం నువ్వు గెలుస్తావు కృష్ణమూర్తి.. మా ఆశీస్సులు నీకే 13వ డివిజన్‌లో విజయ సమర శంఖారావం చింతపట్ల గ్రామపంచాయతీ బోరు వాటర్ పంట పొలాలకు దారి మళ్లింపు 22వ వార్డులో గోవిందరెడ్డి ఐశ్వర్య సుడిగాలి పర్యటన 35 వ డివిజన్ లోడ్ టిడిపి నేతల ఎన్నికల ప్రచారం పశుగ్రాసం సాగుకు 100 శాతం ఉచిత రైతులకు ఖర్చుల భారం తగ్గించే అవకాశం అనంతలో 665 తుపాకుల డిపాజిట్‌ చిరుత సంచారంతో గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్న అటవి శాఖ అధికారులు. జీవిత భాగస్వామి ఎలా ఉండాలంటే సాయిపల్లవి మనసులోని మాటలు ఇవే! వివాహానికి పదివేల రూపాయల విరాళం స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఫ్లాగ్ మార్చ్ లు - ప్రజలతో పోలీసుల ముఖాముఖి - ఎన్నికల హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఫ్లాగ్ మార్చ్ లు - ప్రజలతో పోలీసుల ముఖాముఖి - ఎన్నికల హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక

Select Suryaa Now
స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఫ్లాగ్ మార్చ్ లు - ప్రజలతో పోలీసుల ముఖాముఖి - ఎన్నికల హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహిస్తూ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు చేపడుతున్నారు.జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచిస్తున్నారు.ఎన్నికల సందర్భంగా గొడవలకు దిగడం, ప్రత్యర్థులపై దాడులకు పాల్పడడం, బెదిరింపులకు దిగడం, రెచ్చగొట్టడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎన్నికల హింసకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎన్నికలకు సంబంధించిన సమస్యలు లేదా అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతోందని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ప్రజలు సంయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్