కలెక్టరేట్‌లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమం
సూర్య జగిత్యాల ప్రతినిధి:విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అవగాహన సమావేశం, సమగ్రత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ప్రసూనాంబ, అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజాసేవలో నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రాధాన్యతను వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజలకు నిబంధనల మేరకు సకాలంలో సేవలందించాలని, విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యతతో పనిచేయాలని పేర్కొన్నారు.