|
|
by Suryaa Desk | Mon, Sep 29, 2025, 03:04 PM
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైరసీ, బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై సినీ పరిశ్రమ నిరంతరం పోరాటం చేస్తోందని, ఈ పోరాటంలో హైదరాబాద్ పోలీసులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. పైరసీ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా దెబ్బతింటుందని, అందుకు పైరసీని అరికట్టడం చాలా ముఖ్యమని అన్నారు. అలాగే సినిమా పరిశ్రమ నుండి ఇకపై ఎవరూ కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయరని దిల్ రాజు స్పష్టం చేశారు.
Latest News