BREAKING
పెద్దగెడ్డ జలాశయం నుండి నీరు విడుదల ప్రాంతాల అభివృద్ధి పట్టం కడుతోంది వైద్య సేవలకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ ఒంగోలు నగర మేయర్ గా శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఓట్ల వేటకు"అర్నబ్ "దెబ్బ..బ్రేక్ పడిన అభ్యర్థుల ప్రచారం! * స్తంభించిన స్థానిక సంస్థల ప్రచార పర్వం * అల్పాహార పథకంతో విద్యార్థుల ఆదర్శ శాతం పెరుగుదల మక్కువ.. ఎవరికి ఎక్కువ కాశీలో నివాసం.. ఇల్లు కొంటే వచ్చేది కాదు, శివుడు అనుగ్రహిస్తేనే వస్తుందా? జడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్యను గెలిపించండి జోరు వానలో కూటమి అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం భర్త డైరెక్షన్‌లో బోల్డ్ సీన్లలో నటించడంపై స్పందించిన నటి జ్యోతి పూర్వజ్.. కల్లర్ మూవీ విశేషాలు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి కరువు జాబితాలో నవాబుపేటకు చోటేది? రైల్వే లెవల్ క్రాసింగ్ మరమ్మతులు

యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు రైతులు ప్రాధాన్యమివ్వాలి - మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి

Select Suryaa Now
యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు రైతులు ప్రాధాన్యమివ్వాలి - మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి
సూర్య, మందమర్రి : సాగు భూముల సంరక్షణతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి రైతులకు సూచించారు. యాసంగి సీజన్‌లో వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని అందుగులపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ (సాగు భూమి సంరక్షణ) కార్యక్రమంలో ఆమె రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కిరణ్మయి మాట్లాడుతూ.. నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని, నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సహజ ఎరువులను ప్రోత్సహించాలని, నేల సారాన్ని పెంపొందించేందుకు సుస్థిర పోషక యాజమాన్య పద్ధతులను అవలంబించాలని సూచించారు. సహజ వ్యవసాయంతో పాటు నీరు, భూమి వంటి ప్రకృతి వనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉందన్నారు. వరి కోతల అనంతరం ఖాళీగా ఉండే భూములను సమర్థంగా వినియోగించుకోవాలని, పంట అవశేషాలను పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించాలని తెలిపారు. పంట వ్యర్థాలను పొలాల్లో తగులబెట్టడం వల్ల నేలలోని పోషకాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున, వాటి దహనాన్ని నివారించాలని సూచించారు. సాగు భూముల సంరక్షణ, నీటి పొదుపు, పంటల వైవిధ్యీకరణతో వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్. కనకరాజు, గ్రామ సర్పంచ్ ముత్యం రమ, పంచాయతీ కార్యదర్శి వీరేందర్, పలువురు రైతులు పాల్గొన్నారు.