వికారాబాద్‌లో విషాదం: యువ మహిళా క్రికెటర్ ఆత్మహత్య
వికారాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవల బీసీసీఐ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడిన యువ మహిళా క్రికెటర్ నందిని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, తమ కుమార్తె ఆత్మహత్యకు ప్రేమ వేధింపులే కారణమని నందిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.