BREAKING
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కుందుర్పి లో రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు 'గురురాజ' విద్యార్థి ఎంపిక అవినీతి సొమ్ము రూ. 60-00 లక్షలు తిరిగి చెల్లించమని మాజీ సర్పంచ్ కు షోకాజ్ నోటీసు జారీ. *ఉపాధి హామీ పనులతో గ్రామీణ రహదారికి మరమ్మతులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బానోత్ లింగం నాయక్ రాజమౌళి ‘వారణాసి’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఊహించని సర్‌ప్రైజ్! 2వ సెగ్మెంట్ అభ్యర్థి విస్తృత ప్రచారం మహిళలు, విద్యార్థినులపై ఆకృత్యాలను అరికట్టాలి కటకం కుమారస్వామి, సెగ్మెంట్లో ప్రచారం పట్టుబడ్డ బియ్యంపై కొనసాగుతున్న విచారణ ప్రముఖ మలయాళ సింగర్ రిమి టోమి రెండో పెళ్లి ప్రకటన: ఫిట్‌నెస్ టైనర్‌తో ఏడడుగులు వేయనున్న నటి! భక్తిశ్రద్ధలతో గ్యార్మీ ఉత్సవాలు షబ్బీర్ మృతి పట్ల అనంత వెంకటరామిరెడ్డి సంతాపం భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ వర్లీ లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం. మాత శిశు మరణాల పై ప్రత్యేక సమీక్ష సమావేశం

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో గిరిజనుడికి తీవ్ర గాయాలు

Select Suryaa Now
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో గిరిజనుడికి తీవ్ర గాయాలు
సూర్య జైనూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పార గ్రామపంచాయతీ పరిధిలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం చోటుచేసుకుంది. వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి కినక రాము (38) తీవ్రంగా గాయపడ్డాడు.
సోమవారం సర్పంచ్ మెస్రం జంగుబాయి జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు అమర్చే పనులు చేపట్టారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఎల్‌సీ ఇచ్చామని సమాచారం ఇవ్వడంతో రాము స్తంభం ఎక్కి బల్బు అమర్చుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా జరిగి షాక్‌కు గురయ్యాడు. దీంతో వైర్లు, స్తంభానికి చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి రామును ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. విద్యుత్ శాఖ అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సర్పంచ్ ఆరోపించారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఏఈ లచ్చన్నను వివరణ కోరగా, విద్యుత్ షాక్ ఘటన తన దృష్టికి రాలేదని, వివరాలు తెలుసుకుంటానని తెలిపారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు తీవ్రంగా గాయపడిన గిరిజనుడు కినక రాముకు తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.