telangana
వెలిచాలలో "శనార్తి" సినిమా షూటింగ్..
సూర్య రామడుగు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో శుక్రవారం శనార్తి షూటింగ్ ను ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు. ఈ సినిమా గంగాధర మండలం గట్టు బూత్కూర్ కు చెందిన గణేష్ దర్శకత్వంలో షూటింగ్ చేస్తున్నారు. గతంలో గణేష్ సంపత్ నంది డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రావీణ్యం పొందారు. ఈ సినిమాలో హీరో అఖిల్ హీరోగా నాగ దుర్గ హీరోయిన్ గా నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ రామడుగు గంగాధర కొత్తపల్లి కరీంనగర్ పరిసర ప్రాంతాలలో రెండు నెలల పాటు షూటింగ్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.