పరిసరాల పరిశుభ్రత తో వ్యాధులకు దూరం వారంలో ఒకరోజు డ్రై డే పాటించండి .
రేణిగుంట అక్టోబర్ 23: పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అని జోనల్ మలేరియా అధికారి నిర్మల అలెగ్జాండర్ శుక్రవారం తెలియజేశారు. రేణిగుంట గ్రామపంచాయతీ పరిధిలోని సచివాలయం వన్ పరిధి నందు డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి" డ్రై డే"కార్యక్రమం గురించి పరిసరాలు పరిశుభ్రత పై ఇంటింటికి వెళ్లి లార్వా సర్వే కార్యక్రమం గురించి అవగాహన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు. మురికి నీళ్లు నిలువ ఉండడం ద్వారా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. మురికి నీళ్లు నిల్వ ఉంటే దోమలు ఉత్పత్తి అయ్యి డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, మెదడువాపు, బోదకాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచించారు. అలాగే చెత్తను కూడా కాలువల్లో పడే రాదన్నారు. చెత్తను కాలువల్లో పడేస్తే నీళ్లు నిల్వ ఉండే దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు ప్రతి ఒక్కరు సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు అందరూ సమిష్టి కృషితో వ్యాధులను తరిమికొడతామన్నారు. దోమల నివారణ కోసం దోమతెరలు వాడడంతో పాటు రాత్రిపూట వేపాకు వేసుకోవాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు, పూల కుండీలు లాంటివి ఉండడం ద్వారా వాటిల్లో నిల్వ ఉంటే దోమలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, హెల్త్ సూపర్వైజర్, సరస్వతి, హెల్త్ అసిస్టెంట్ ముని వెంకటప్ప, ఏ.ఎన్.ఎం , రేవతి,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
H. Dwaraka, staff reporter.
Cell no 9705347341