BREAKING
నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి:

పట్టణ అభివృద్దికి సహకరించండి 22వ వార్డు టీడీపీ అభ్యర్ధి విజయలక్ష్మి

Select Suryaa Now
పట్టణ అభివృద్దికి సహకరించండి 22వ వార్డు టీడీపీ అభ్యర్ధి విజయలక్ష్మి

రామచంద్రపురం మేజర్‌ న్యూస్‌:గత కొన్నేళ్లుగా ఏరాజకీయ పార్టీ నాయకుడు పరిష్కరించని పట్టణంలోని కబేళా సమస్యను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ చొరతో శాశ్వత పరిష్కరం అయ్యిందని, పట్టణాన్ని మరింత అభివృద్ది చేసేందుకు కూటమి అభ్యర్దులను గెలిపించి పట్టణ ప్రజలు సహకరించాలని టీడీపీ సీనియర్‌ నాయకురాలు, 22వ వార్డు కౌన్సిలర్‌ టీడీపీ అభ్యర్ధిని జాస్తి విజయలక్ష్మి పిలుపు నిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో గల 22వ వార్డులో పలు ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులో గల ప్రజలను ఇంటింటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఈ సందర్బంగా విజయలక్ష్మి వార్డులో పలు చోట్ల మాట్లాడుతూ మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా గడచిన రెండేళ్లలో మంత్రి సుభాష్‌ ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసిందన్నారు. మరిన్ని మౌళికసదుపాయాల కల్పనకు టీడీపీ కౌన్సిలర్‌గా గెలిపించాలని ఆమె కోరారు. పార్టీ  నేతలు రెడ్డి సురేష్, చెలంకూరి కల్యాణ్, ముత్యాల శ్రీహరి, కొమరిన శ్రీనివాస్, పసళ్ల వీరన్నచౌదరి, పసల వీర్రాజు చౌదరి, కొప్పెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.