కడియం ఎంపీపీ కూటమి అభ్యర్థిగా పుణ్యవతి నామినేషన్
కడియం, మేజర్ న్యూస్, :కడియం మండల ఎంపీపీ పదవికి కూటమి అభ్యర్థిగా బోడపాటి గోపి సతీమణి పుణ్యవతి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఆరో వార్డు ఎంపీటీసీ అభ్యర్థిగా కూడా ఆమె నామినేషన్ సమర్పించారు. బోడపాటి గోపి ఒకటో, మూడో వార్డుల ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో నామినేషన్ కార్యక్రమం సందడిగా సాగింది.అంబికా నర్సరీ అధినేతగా, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్‌గా వ్యవహరించిన బోడపాటి గోపి రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ స్థానికంగా తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
నామినేషన్ కార్యక్రమంలో ఏపీఐఐసీ మార్గాని సత్యనారాయణ, గట్టి నరసయ్య, గట్టి సుబ్బారావు, పాఠం శెట్టి రాంజీ, జనసేన జడ్పీటీసీ అభ్యర్థి రత్నం అయ్యప్ప, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడు బొరుసు సుబ్బారావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా