BREAKING
నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి:

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.... కలెక్టర్ మహేష్ కుమార్..

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.... కలెక్టర్ మహేష్ కుమార్..

అమలాపురం మేజర్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం అమలాపురం పట్టణ పరిధిలోని ఎస్.కె.బి.ఆర్. కళాశాల, ఈదరపల్లి ఎంపీడీవో కార్యాలయాలను జిల్లా కలెక్టర్ సందర్శించి, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు :ఎస్.కె.బి.ఆర్. కళాశాలలోని కామర్స్ బ్లాక్‌లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన క్యూలైన్లు, కౌంటింగ్ టేబుళ్లు, భౌగోళిక నమూనా ఆధారంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోని ప్రతి బ్లాక్‌లో అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. 
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ల కేంద్రాల వద్ద అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వర్తించే అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ ఆఫీసర్ ఎం. నిర్మల్ కుమార్, కొత్తపేట డీఎస్పీ ఎం. శంకర్ మురళీమోహన్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాణి సంయుక్త తదితరులు పాల్గొన్నారు.