BREAKING
రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: గోదావరి జిల్లాలను తలపించేలా 'ఇడుపు కాయితం' లొకేషన్లు.. బన్నీవాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఎల్‌నినోపై రాజకీయాలు కాదు.. ప్రజలకు అండగా నిలవాలి

Select Suryaa Now
ఎల్‌నినోపై రాజకీయాలు కాదు.. ప్రజలకు అండగా నిలవాలి

హైదరాబాద్ :ప్రకృతి విపత్తులు, వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని ప్రజలకు అండగా నిలవడమే రాజకీయ పార్టీల బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ప్రజాభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన ఎల్‌నినో అవగాహన, ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో మోదీ ఇచ్చిన పిలుపుకు ప్రజలంతా ఎలా స్పందించారో గుర్తుచేస్తూ, ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ ప్రతిపక్షాలు రాజకీయ బురదజల్లే యత్నాలు విడనాడి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. రాష్ట్రంలోని 621 మండలాలకు గాను 324 మండలాల్లో భూగర్భ జలాల కొరత తీవ్రంగా ఉందని, సుమారు 15 లక్షల పంపుసెట్లు ఉన్న ప్రాంతాల్లో నీళ్లు అడుగంటి మోటార్లు కాలిపోతుండటంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. బోరుబావుల్లో నీటి లభ్యతపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారిని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గడంతో రానున్న రబీ సీజన్‌లో వరి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 20,018 మెగావాట్లకు చేరినప్పటికీ ముందస్తు ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలు, పశుపక్ష్యాదులకు తాగునీరు అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేసి ప్రజలకు భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు.