15వ వార్డులో వైసీపీ అభ్యర్థి శ్యామలాదేవికి ముస్లిం పెద్దల మద్దతు..
అమలాపురం మేజర్ న్యూస్ పట్టణంలోని 15వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి సంసాని శ్యామలాదేవికి మద్దతుగా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖాదర్, అసెంబ్లీ మైనారిటీ సెల్ అధ్యక్షులు కాజా బాబు తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ఓటర్లను కలుసుకుంటూ శ్యామలాదేవికి మద్దతు తెలియజేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థి సంసాని శ్యామలాదేవి మాట్లాడుతూ, తన భర్త సంసాని చంద్రశేఖర వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తాను కూడా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ ఎన్నికల్లో తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆదరించి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వార్డు ఓటర్లను శ్యామలాదేవి విజ్ఞప్తి చేశారు.