BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

కడియంలో ముగిసిన నామినేషన్ల పర్వం ఎంపీటీసీ స్థానాలకు 116 మంది.. జడ్పీటీసీ స్థానానికి 8 మంది అభ్యర్థులు!

Select Suryaa Now
కడియంలో ముగిసిన నామినేషన్ల పర్వం  ఎంపీటీసీ స్థానాలకు 116 మంది.. జడ్పీటీసీ స్థానానికి 8 మంది అభ్యర్థులు!

కడియం ,మేజర్ న్యూస్ ,:కడియం మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడు రోజులపాటు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 116 మంది, జడ్పీటీసీ స్థానానికి ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.
ఎంపీటీసీ స్థానాలకు 116 నామినేషన్లు
ఎంపీటీసీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ నుంచి 32 మంది, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 49 మంది, జనసేన నుంచి 22 మంది, బీజేపీ నుంచి తొమ్మిది మంది, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముగ్గురు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 116 మంది నామినేషన్లు సమర్పించారు.
జడ్పీటీసీ స్థానానికి 8 మంది అభ్యర్థులు
జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకరు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో జడ్పీటీసీ స్థానానికి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో కడియం మండలంలో స్థానిక ఎన్నికల సందడి మరింత పెరిగింది. తదుపరి నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం తుది ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది.