జనగామ ప్రజలకు జిఎం లలిత్ కుమార్ భరోసా.. ఆందోళన వద్దు, అండగా ఉంటాం!
సూర్య-గోదావరిఖని:పట్టణానికి సమీపంలోని జనగామ గ్రామంలో చేతి బోరింగ్ పంపు కుంగిన ఘటనపై సింగరేణి రామగుండం ఏరియా-1 జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్ కొద్దిసేపటి క్రితం స్పందించారు. గ్రామ ప్రజలు ఆందోళన చెందవద్దని, ఘటనకు గల కారణాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన భద్రతా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు శనివారం ఉదయం సర్వే, జియాలజికల్ బృందాలను గ్రామానికి పంపించనున్నట్లు తెలిపారు. బోరింగ్ పంపు కుంగిపోవడానికి గల కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని జిఎం స్పష్టం చేశారు.
-------