BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

నెలలు తిరగక ముందే పెచ్చులూడిన జగ్గనతోట రోడ్డు.. సీఎం పర్యటన కోసం హడావుడి పనులే కొంప ముంచాయా.?

Select Suryaa Now
నెలలు తిరగక ముందే పెచ్చులూడిన జగ్గనతోట రోడ్డు.. సీఎం పర్యటన కోసం హడావుడి పనులే కొంప ముంచాయా.?

 -అంబాజీపేట మేజర్ న్యూస్ :పర్యటన కోసం వేసిన రోడ్డు నెల తిరక్కుండానే కుంగిపోయింది.డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని ప్రధాన జగ్గనతోట రహదారి నాణ్యతా లోపంతో పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన వేళ అధికారులు హడావుడిగా చేపట్టిన పనుల్లో నాణ్యత గాలికొదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.రోడ్డు మార్జిన్లలో గ్రావెల్ నింపకుండా, కనీస పటిష్టత లేకుండా తూతూమంత్రంగా పనులు ముగించడంతో ఇప్పుడు రోడ్డు అంచులు పెచ్చులూడి కాలువలోకి జారిపోతున్నాయి.
ప్రమాదపు అంచున ప్రయాణం
రహదారి పక్కన భారీ గొయ్యి  తలపిస్తోంది. రోజూ వందలాది వాహనాలు తిరిగే ఈ మార్గంలో ఎదురెదురుగా వాహనాలు వస్తే  తప్పుకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. పక్కకు జరిగితే నేరుగా కాలువలో పడే పరిస్థితి ఉండటంతో, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు.వీఐపీల పర్యటనలప్పుడే హడావుడి చేసే అధికారులు, ప్రజల ప్రాణాల విషయంలో నిర్లక్ష్యం వీడాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి కుంగిన గట్టును పునర్నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని  పలువురు విన్నవిస్తున్నారు..