BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Select Suryaa Now
 వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
సూర్య, వీణవంక:వీణవంక మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన నూతన గృహప్రవేశ వేడుకలు, అలాగే ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మండలంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు శ్రావ్య - పవన్ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి, కుటుంబ సభ్యులను అభినందించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దాసరపు సరోజన రాజేంద్రప్రసాద్, సర్పంచులు మండల కుమారస్వామి, మ్యాడగొని తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ లతా శ్రీనివాస్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 
 
-- కొనుగోలు కేంద్రం ప్రారంభం...
 
ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు తాగునీరు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు వంటి మౌలిక వసతులు కల్పించాలని, తూకంలో ఎలాంటి తేడాలు రాకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసారపు సరోజన, ముసిపట్ల తిరుపతి రెడ్డి, రాయిశెట్టి లత, నీల కుమారస్వామి, ఐకేపీ సీసీలు ఆనంద్, ఘన శ్యామ్, మహిళా సంఘ సభ్యులు, హమాలీ సంఘ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.