BREAKING
దిల్ సే షూటింగ్‌లో ప్రాణాలు కాపాడిన షారుఖ్ ఖాన్.. నటి మీతా వశిష్ట ఆసక్తికర జ్ఞాపకాలు "విజయ్"నగర ఏలిక.... అవనాపు భార్గవి ఇక.... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి - ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలి* *డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి* ఉత్తరాఖండ్‌లో తీవ్రరూపం దాల్చిన కేదార్‌తాల్‌ ట్రెకర్స్ రెస్క్యూ ఆపరేషన్ నేడు మండల జిల్లా ప్రాదేశికఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి. తెల్లవారుజామునే సంచలన పాటను విడుదల చేసిన సల్మాన్ ఖాన్.. యుద్ధ చిత్రంలో ఈ రొమాంటిక్ సాంగ్ ఏంటని అభిమానుల్లో గందరగోళం నన్ను గెలిపించండి... మీ రుణం తీర్చుకుంటా..! రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి మోరీ గేట్ మార్కెట్‌లో 7000 కిలోల కల్తీ కోవా ధ్వంసం.. సీఎం రేఖా గుప్తా నవంబర్ 5న కర్నూలు జిల్లాలోని అన్ని బ్యాంకులకు స్థానిక సెలవు* *జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* భారత సేవల రంగం..అక్టోబర్‌లో 55.8కి పెరిగిన పీఎంఐ హరికేన్ కట్రినా బాధితుల కోసం హాలీవుడ్ నటి శాండ్రా బుల్లక్ గొప్ప మనసు.. పాఠశాలలో ఉచిత ఆరోగ్య క్లినిక్ ఏర్పాటుకు ఆర్థిక సాయం కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు మంత్రివర్గ ఆమోదం అభివృధి అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమిప్రధాన ధ్యేయం.

వరదలో చిక్కుకున్న వ్యక్తికి పునర్జన్మ

Select Suryaa Now
వరదలో చిక్కుకున్న వ్యక్తికి పునర్జన్మ

వరదలో చిక్కుకున్న వ్యక్తికి పునర్జన్మ.. 
-ప్రాణాలకు తెగించి రక్షించిన కానిస్టేబుల్ సంతోష్
-సంతోష్ సాహసానికి స్థానికుల సెల్యూట్

అశ్వారావుపేట ఆర్ సీ, (సూర్య) మృత్యువు ముంచుకొస్తున్న వేళ ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసోపేతంగా స్పందించారు.అశ్వారావుపేట మండలంలో సుమారు 3 కిలోమీటర్ల రాయి వద్ద భారీ వర్షాలకు ఉప్పొంగిన వరద ప్రవాహంలో బైక్‌తో సహా చిక్కుకున్న సుబ్బారావుకు కానిస్టేబుల్ బి.సంతోష్ అండగా నిలిచారు. నీటి ఉధృతి పెరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను గమనించిన సంతోష్ ఏమాత్రం వెనుకాడకుండా వరదలోకి దూకి ఫైర్ సిబ్బంది, స్థానికుల సహకారంతో సుబ్బారావును, బైక్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.తన ప్రాణాలను పణంగా పెట్టి ఓ వ్యక్తికి ప్రాణభిక్ష పెట్టిన కానిస్టేబుల్ సంతోష్ సాహసం పోలీసుల మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఆయన ధైర్యసాహసాలకు స్థానికులు ప్రశంసలు కురిపిస్తూ సెల్యూట్ చేస్తున్నారు.