BREAKING
ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్ శాంతి సమావేశాలు డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్. అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు! ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాలులో జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ సంస్మరణ సభ

వైరల్ జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండండి..

Select Suryaa Now
వైరల్ జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండండి..

వైరల్ జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండండి..

- ఎర్రగుంట పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ నాజినిన్ తబ్బసూమ్..

-  భీమునిగూడెం పంచాయతీలో వైద్య శిబిరం...

వైరల్ జ్వరాలు ప్రబులుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాజినిన్ తబ్బసూమ్ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని భీమునిగూడెం పంచాయతీలో శుక్రవారం ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఔషధాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. మురుకు నీరు నిల్వ ఉండటం వలన దోమలు వృద్ధి చెందుతాయని, దోమల నివారణ చర్యల్లో భాగంగా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. మీ ఇంటి పరిశుభ్రత మీ కుటుంబానికి మూలం  అన్నారు. . ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాందాస్, ఆరోగ్య కార్యకర్త శ్రీదేవి, ఆశా కార్యకర్తల తిరుపతమ్మ, పద్మ, తదితరులు ఉన్నారు.

సూర్య ప్రతినిధి, అన్నపురెడ్డిపల్లి, చందు..