BREAKING
హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం ఫార్మా డి, లా పరీక్ష ఫలితాలు విడుదల కూటమి తరపున తల్లి, కూతుర్లు విజయం ఎయిమ్స్‌(ఇనిసెట్‌) పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ ఓయన్ కొత్తూరులో టీడీపీ విజయకేతనం ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం మేకపాటి కోటలో ఎగిరిన పసుపు జెండా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు టీడీపీ కైవసం వైభవంగా పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు వెల్దుర్తి జడ్పిటిసి తెదేపా అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు ఘనవిజయం రామభద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ హవా ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా వాసులకు బంగారు, వెండి పథకాలు నాకాఫ్ టెండర్‌ను రద్దు చేయాలి- ఐక్య విద్యార్థి సంఘాలు ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి వెలుగులు నిండాలి లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం.. భార్యకు తీవ్ర గాయాలు

తిమ్మాపూర్‌లో వృద్ధురాళ్ల వరుస హత్యల కేసు ఛేదన

Select Suryaa Now
తిమ్మాపూర్‌లో వృద్ధురాళ్ల వరుస హత్యల కేసు ఛేదన

సూర్య కరీంనగర్ ప్రతినిధి: తిమ్మాపూర్ మండలం వచ్చనూర్ గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న ఇద్దరు వృద్ధురాళ్లను ఆభరణాల కోసం హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.

ఈ ఏడాది ఆగస్టు 16న 103 ఏళ్ల ఉప్పులేటి భూదమ్మను, అక్టోబర్ 31న 80 ఏళ్ల ఉప్పులేటి లక్ష్మి అలియాస్ లచ్చవ్వను నిందితులు హత్య చేసి వారి వద్దనున్న బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. వృద్ధాప్యం కారణంగా సహజ మరణాలుగా భావించేలా నిందితులు వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

శనివారం అలుగునూర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీల సమయంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, రెండు హత్యల్లో తమ ప్రమేయాన్ని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

అరెస్టయిన వారిలో మద్దూరి సాయి, కిన్నెర రాజు, ఎల్కతుర్తి రాజు, మానుకోల పవన్ కుమార్ ఉన్నారు. కనపర్తి మణికంఠ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి టీవీఎస్ జూపిటర్ స్కూటీ, బజాజ్ పల్సర్ బైక్, వెండి కడియాలు, ఐదు సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

కేసును ఛేదించిన రూరల్ ఏసీపీ, తిమ్మాపూర్ సీఐ, ఎస్సైలు, పోలీసు సిబ్బందిని సీపీ గౌస్ ఆలం అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.