BREAKING
జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో హుండీ లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి... ఏఎస్ డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డబుల్ వచ్చిందా లేదా జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం ఔట్సోర్సింగ్ సిబ్బందికి 160 శాతం వేతనం పెంపు అన్ని లెక్కలూ సరిచేసిన కోటంరెడ్డి సోదరులు.. రూరల్‌లో వైసీపీకి ఎదురుదెబ్బ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి కోగిలిలో టీడీపీ అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల సంబరాలు ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ. 7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్. బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది తెలంగాణ రాష్ట్ర మరియు ఖేడ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎన్నాళ్లీ ప్రమాదాల పరంపర.. చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా? కూటమి శ్రేణులతో విజయోత్సాహాన్ని పంచుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు.

Select Suryaa Now
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు.

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా రాష్ట్రంలోని ఆరు పట్టణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమహేంద్రవరం, తిరుపతి నగరపాలక సంస్థలతో పాటు కుప్పం మున్సిపాలిటీకి ఈ అవార్డులు ప్రకటించడం రాష్ట్ర పురపాలక శాఖకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు లభించినట్లయిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో రాష్ట్రంలోని పట్టణాలను పరిశుభ్రంగా, స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న 'స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం ద్వారా పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, చెత్త రహిత పట్టణాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.పట్టణాల్లో పారిశుధ్య ప్రమాణాలను మెరుగుపరచడం, చెత్త నిర్వహణను పటిష్టం చేయడం, ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం వంటి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి తెలిపారు.  స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆయా నగరపాలక సంస్థల అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బందికి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వారి కృషి, అంకితభావం వల్లే రాష్ట్రానికి ఈ గుర్తింపు సాధ్యమైందని పేర్కొన్నారు.ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను డంపింగ్ యార్డులు లేని పట్టణాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా మార్చి, రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ నెల 11వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేయనుందని మంత్రి నారాయణ వెల్లడించారు.