నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరిగిన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలబడ్డాయి. ఈ ఫలితాల్లో నందవరం జడ్పిటిసి అక్క మహాదేవి 4469 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సిపి అభ్యర్థిని బోయ బజారమ్మపై జయం సాధించింది. అక్కమహాదేవి మొన్నటివరకు నందవరం మండలం పూల చింత గ్రామ సర్పంచ్ గా ప్రజలకు సేవలు అందించారు. ఆమె భర్త బండి గురుస్వామి టిడిపి మండల నాయకులుగా ఉంటూ ఎమ్మెల్యే డబి వి జయ నాగేశ్వర్ రెడ్డి కి ప్రధాన అనుచర నాయకుడిగా మండల ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అక్కమహాదేవి గెలుపు నందవరం మండలాభివృద్ధికి మలుపుగా తిరిగి అభివృద్ధి పథంలో అందరం ఎక్కుతుందని మండల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అక్కమహాదేవి విలేకరులతో మాట్లాడుతూ నందవరం మండలం ఓటర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నందవరం ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాసేవకు అంకితమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లతోపాటు ఎమ్మెల్యే వివి జయ నాగేశ్వర్ రెడ్డి అడుగుజాడల్లో పయనిస్తూ నందవరం మండలాన్ని సంక్షేమం, అభివృద్ధి అనే రెండు సిద్ధాంతాలపై నిలిచి ముందుకు పోతా అన్నారు. ప్రజా ఆశీర్వాదంతో కర్నూలు జిల్లా పరిషత్ నుండి నిధులు సాధించి మండలాభివృద్ధికి పాటుపడుతున్నారు.
ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక సీటుతో సరిపెట్టుకున్న వైసీపీ
నందవరం మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 ఎంపీటీసీ స్థానాలను టిడిపి కైవాసం చేసుకుంది. ఒక ఎంపీటీసీ స్థానంలో టిడిపి రెబల్ అభ్యర్థి గెలుపొందగా వైసిపి ఒక్కటి అంటే ఒక సీటుతో సరిపెట్టుకుంది. అక్కడ నాయకత్వలోకము వైసీపీకి బలంగా కనబడుతున్న.. పోల్ మేనేజ్మెంట్ చేయలేకనే చేతికి పడ్డదని చెప్పవచ్చు. కొన్నిచోట్ల వైసిపి నాయకులు అధికార పార్టీకి సరైన కూడా అభ్యర్థులను మోసం చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. నందవరం వైసీపీ ఎంపీపీ అభ్యర్థి యు.లక్ష్మి నాగలదిన్నె రెండు ఎంపీటీసీ బరిలో 11 ఓట్లతో ఓటమి చవి చూసింది.
రాజా శరత్ కుమార్,సూర్య ప్రతినిధి,ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.