జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా ప్రజలకు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటామని అన్నారు. రావణుడిపై గెలిచి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని, ఆ సంప్రదాయమే దీపావళి అసలు సందేశమని చెప్పారు. ప్రతి ఇంటా దీపాల వెలుగులతో పాటు అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం నిండాలని ఎంపీ గారు కోరుకున్నారు. ఈ పండుగ ప్రతి కుటుంబంలో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని, నెల్లూరు జిల్లా, పార్లమెంటు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.