BREAKING
భట్టిప్రోలు మండలం లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి కాలిఫోర్నియా పోర్టుల కాంట్రాక్టు చర్చలు పొడిగింపు పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై విచారణ దక్షిణ అమెరికా పర్యటనలో పాప్ లియో ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సముద్ర దిగ్బంధానికి తోడుగా సరిహద్దు వాణిజ్యంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు విశాఖ యువకులను క్షేమంగా స్వదేశానికి చేరుస్తాం : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొత్తూరు జడ్పిటిసి గా టిడిపి అభ్యర్థి లోతుగెడ్డ శ్రీదేవి గెలుపు పండుగ సాయన్న జీవితం అందరికీ ఆదర్శం నెల్లిమర్లలో కూటమి హవా.. *ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ, జనసేన * జడ్పిటిసిగా టిడిపి అభ్యర్థి వెంకటమ్మ ఘన విజయం ఎంపీటీసీలుగా తల్లీకూతుళ్ల ఘన విజయం చైర్మన్ వర్గం లోపారి ఒప్పందమే శంబరలో అభ్యర్థి ఓటమి.? జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ పాలకొండ జడ్పిటిసి గా వెంకట్రావు

కూటమి శ్రేణులతో విజయోత్సాహాన్ని పంచుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Select Suryaa Now
కూటమి శ్రేణులతో విజయోత్సాహాన్ని పంచుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

రాజుపాళెం,   మేజర్ న్యూస్ :   కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శనివారం రాజుపాళెంలోని జీవన్ జ్యోతి కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు భారీ విజయాలు సాధిస్తుండటంతో, అక్కడి కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులతో కలిసి ఎమ్మెల్యే గారు విజయోత్సాహాన్ని పంచుకున్నారు. కౌంటింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే గారు చేరుకోగానే అక్కడి వాతావరణం సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానికులు, కూటమి శ్రేణులతో ఎమ్మెల్యే గారు ఆప్యాయంగా ముచ్చటించారు. ఫలితాల సందర్భంగా నెలకొన్న ఆనందాన్ని వారితో కలిసి పంచుకున్నారు. విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తూ, అక్కడి నాయకులు, కార్యకర్తలతో కొంతసేపు ఉత్సాహంగా గడిపారు.