BREAKING
జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో హుండీ లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి... ఏఎస్ డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డబుల్ వచ్చిందా లేదా జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం ఔట్సోర్సింగ్ సిబ్బందికి 160 శాతం వేతనం పెంపు అన్ని లెక్కలూ సరిచేసిన కోటంరెడ్డి సోదరులు.. రూరల్‌లో వైసీపీకి ఎదురుదెబ్బ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి కోగిలిలో టీడీపీ అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల సంబరాలు ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ. 7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్. బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది తెలంగాణ రాష్ట్ర మరియు ఖేడ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎన్నాళ్లీ ప్రమాదాల పరంపర.. చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా? కూటమి శ్రేణులతో విజయోత్సాహాన్ని పంచుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం

Select Suryaa Now
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం

 

• లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బైక్‌ ఢీ.. ఇద్దరు అక్కడికక్కడే మృతి, ఆస్పత్రిలో మరొకరు మృతి

సూర్య, నస్పూర్‌ :

మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బైక్‌ ప్రమాదానికి గురై ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

వివరాల్లోకి వెళితే.. శనివారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో మంచిర్యాల నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న లారీని గుడిపేట ఫిష్‌ మార్కెట్‌ సమీపంలో ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్‌ ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో బైక్‌ లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు అఫ్రోజ్‌ (24), సోహెల్‌ (23) అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరూ మంచిర్యాల వాసులుగా గుర్తించారు. నస్పూర్‌ కృష్ణ కాలనీకి చెందిన సిద్ధు (25) తీవ్రంగా గాయపడటంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కూడా మృతిచెందాడు.

• ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే మృత్యువాత

సిద్ధు మృతితో నస్పూర్‌లోని కృష్ణ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన తల్లి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా.. సిద్ధు తాతయ్య వద్ద కృష్ణ కాలనీలో ఉంటున్నాడు. ఇటీవలే మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కార్మికుడిగా ఉద్యోగంలో చేరాడు. కొత్త ఉద్యోగంతో జీవితంలో స్థిరపడతాడని ఆశించిన కుటుంబానికి రోడ్డు ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది. కుమారుడి మృతితో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముగ్గురు యువకులు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.