కూటమి తరపున తల్లి, కూతుర్లు విజయం
ఆమదాలవలస, సూర్య : ఆమదాలవలస మండలంలో కూటమి తరపున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన తల్లి కూతుర్లు విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలివరం ఎంపీటీసీ స్థానానికి తమ్మినేని భారతమ్మ పోటీ చేయగా 1244 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈమె కూతురు తమ్మినేని సుజాత ఆమదాలవలస మండల జడ్పిటిసిగా పోటీ చేసి 3600 ఓట్ల మెజార్టీతో పొందారు. ఇద్దరూ కూటమి తరపున గెలుపు పొందడంతో ఆమదాలవలస మండలం తొగరాం స్వగ్రామంలో కూటమి నాయకులు ఆనందోత్సవాలతో సంబరాల్లో మునిగిపోయారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకేసారి గెలుపొందడంపై పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. కోటని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ వలన ఈ విజయానికి నాంది పలికిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.