BREAKING
జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో హుండీ లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి... ఏఎస్ డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డబుల్ వచ్చిందా లేదా జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం ఔట్సోర్సింగ్ సిబ్బందికి 160 శాతం వేతనం పెంపు అన్ని లెక్కలూ సరిచేసిన కోటంరెడ్డి సోదరులు.. రూరల్‌లో వైసీపీకి ఎదురుదెబ్బ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి కోగిలిలో టీడీపీ అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల సంబరాలు ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ. 7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్. బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది తెలంగాణ రాష్ట్ర మరియు ఖేడ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎన్నాళ్లీ ప్రమాదాల పరంపర.. చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా? కూటమి శ్రేణులతో విజయోత్సాహాన్ని పంచుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం

ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి వెలుగులు నిండాలి

Select Suryaa Now
ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి వెలుగులు నిండాలి

నెల్లూరు కలెక్టరేట్, మేజర్ న్యూస్  :   దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలు, ఆనందాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ ఐకమత్యం, సోదరభావం, పరస్పర సహకారంతో దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తూ, ప్రజల భాగస్వామ్యంతో నెల్లూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. దీపావళి వేడుకలను పర్యావరణహితంగా, సురక్షితంగా జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు. బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ దీపావళి పండుగ జిల్లా ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరికీ శాంతి, సంతోషం, సౌభాగ్యం కలగాలని, నెల్లూరు జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆకాంక్షించారు.