ఎయిమ్స్(ఇనిసెట్) పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ
ఆమదాలవలస, సూర్య : ఆమదాలవలస మున్సిపాలిటీ ఒకటో వార్డు తిమ్మాపురం గ్రామానికి చెందిన మామిడి శ్రీప్రజ్ఞ భారతదేశంలో ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థల్లో (ఎయిమ్స్, ఇనిసెట్) పీజీ ప్రవేశ పరీక్షలో తన ప్రతిభ చాటింది. జాతీయ స్థాయిలో 346 ర్యాంకు సాధించింది. శ్రీప్రజ్ఞ ప్రాధమిక విద్య పట్టణంలోని భవిత పాఠశాలలో, ఇంటర్మీడియెట్ చైతన్య విద్యా సంస్థల్లో చదివింది. కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది. ఈయన తండ్రి ఎంవీ పార్ధసారధి గుత్తావల్లి హైస్కూ్‌ల్‌లో బయాలజికల్ టీచర్‌గా పని చేస్తున్నారు. తల్లి పూర్ణ గృహిణి. తన ఈ విజయానికి తల్లిదండ్రులతో పాటు గురువులే కారణమని శ్రీప్రజ్ఞ పేర్కొంది. భవిష్యత్‌లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపింది.