ఓయన్ కొత్తూరులో టీడీపీ విజయకేతనం
300 ఓట్ల మెజారిటీతో దేవి బేటప్ప నాయుడు విజయం
గుడిపల్లి మేజర్ న్యూస్: గుడిపల్లి మండలంలోని ఓయన్ కొత్తూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవి బేటప్ప నాయుడు 300 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల్లో ప్రత్యర్థులపై ఆధిక్యం సాధించి విజయాన్ని అందుకున్నారు.
ఈ విజయంతో గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభ్యర్థికి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు దేవి బేటప్ప నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.
సూర్య రిపోర్టర్:-లెనిన్ బాబు గుడిపల్లి మండలం