telangana
వాంకిడికలాన్ పాఠశాలలో ఘనంగా ఫ్లాగ్ డే వేడుకలు
సూర్య వాంకిడి : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 7న పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ వాంకిడికలాన్ పాఠశాలలో ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో కులమతాలకు అతీతంగా ఐకమత్యం, సోదరభావం, మతసామరస్యం పెంపొందించేందుకు సర్వమత ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సర్వమత సమానత్వం, పరస్పర గౌరవం, మానవత్వం వంటి విలువలను విద్యార్థులకు తెలియజేశారు. భిన్న మతాలు, ఆచారాలు ఉన్నప్పటికీ అందరూ ఒక్కటేనని, సమాజంలో శాంతి సామరస్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. నటరాజ్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్‌చార్జి ఉపాధ్యాయురాలు ఎస్. శోభారాణి, ఉపాధ్యాయులు ఆర్. విష్ణు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.