ఆమదాలవలస మండలం కూటమి కైవసం * ఒకే ఒక్క స్థానంలో వైసిపి గెలుపు *
ఆమదాలవలస, సూర్య : ఆమదాలవలస మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు 12 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఒకే ఒక్క స్థానానికి వైసీపీ పరిమితం అయ్యింది. కూటమి సాధించిన 12 స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేన పార్టీ దక్కించుకోగా, మిగిలిన 11 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కలివరం ఎంపీటీసీ స్థానం తమ్మినేని భారతమ్మ టిడిపి తరఫున 1244 అత్యధిక మెజార్టీతో మండలంలో గెలుపొందారు. టీడీపీ నుంచి దూసి దుప్పల ధనలక్ష్మి, కొర్లకోట అన్యపు రాజేశ్వరి, తోటాడ హనుమంతు సాగర కుమార్, కనుగులవలస నూక అప్పలసూరనాయుడు (రాజు ), కట్యాచార్యుల పేట బొడ్డేపల్లి గౌరీపతి, శ్రీనివాసాచార్యుల పేట బొడ్డేపల్లి సుజాత, రామచంద్రాపురం ఇప్పిలి సత్యనారాయణ, మునగవలస బొత్స అప్పన్న, నిమ్మ తొర్లాడ వండాన శ్రీదేవి, నెల్లిపర్తి పడాల సుజాత గెలుపొందగా, జనసేన పార్టీ నుంచి కొల్లివలస ఎంపీటీసీ స్థానానికి జోగి చందు మనోహర్, వైసీపీ నుంచి చీమలవలస ఎంపీటీసీ స్థానానికి తమ్మినేని శ్రీరామ్ మూర్తి గెలుపు పొందారు. అత్యధిక స్థానాలు కూటమి దక్కించుకోవడంతో టిడిపి శ్రేణులు ఆనందోత్సవంతో సంబరాల్లో మునిగిపోయారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గెలుపుకు కృషి చేసినట్లు నాయకులు భావిస్తున్నారు.