వైభవంగా పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు
విజయనగరం (కల్చరల్), సూర్య : పట్టణంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి వనంగుడి నుండి చదురు గుడి వరకు దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి కలశజ్యోతుల కార్యక్రమం మంగళవాద్యాలనడుమ వైభవంగా జరిగింది. పైడి తల్లి అమ్మ వారి సిరి మాను, తెప్పోత్సవం అనంతరం ప్రతిఏటా నిర్వహించినట్లు జరిగిన ఈకార్యక్రమంలో భాగం ఆలయంలో అమ్మవారికి ఆలయవేదపండితులు సాయికిరణ్ శర్మ, నరసింహమూర్తి శర్మలు గణపతి పూజ ,పుణ్యాహవచనం, స్నపనం నిర్వహించి ప్రత్యేక అలంకరణలు, పూజలుజరిపి ఉత్సవమూర్తితో ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసి ప్రత్యేక రథంపై నిలిపి ఉత్సవం నిర్వహించారు.ఈకార్యక్రమాన్ని దేవస్థానం ఇఓ .కె.శిరీష, ఆలయం ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావులు రథం తాడులాగి ప్రారంభించారుభించారు. మండలదీక్షాధారులు జ్యోతులు తో జైపైడిమాంబనినాదాలుచేస్తూ చదురు గుడి మెట్లవరకుచేరుకుని జ్యోతులు ఉంచారు.దేవస్దానం వేదపండితులు,సిబ్బంది, బాలాజి, అర్చకులు ,మహిళలు పాల్గొన్నారు.